*రేపు అసెంబ్లీకి KCR.. పెరిగిన పొలిటికల్ హీట్*
TG: రేపటి నుంచి (డిసెంబర్ 29) ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే BRS అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందుకోసం నేడు ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ అసెంబ్లీకి రానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది…
తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ ద్రోహమే చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్కు వేరే పార్టీలకు తెలంగాణపై పట్టింపు లేదని తెలిపారు. తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర, రాష్ట్ర విధానాల పట్ల పోరాటం చేయాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీల విధానాలను ఎండగడుతామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్తాం.. ఉద్యమాన్ని నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను పరిక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని చెప్పారు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదని.. అసెంబ్లీలోనే ద్రోహాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ముందు నిర్ణయించిన విధంగా బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు..
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 9133057959