సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల జర్నలిస్టుల పాత్ర కీలకం
వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పందిరి జ్యోతి వెంకన్న
దేవరకొండ …….
సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయులు జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పందిరి జ్యోతి వెంకన్న అన్నారు. ఆదివారం జర్నలిస్టు డేను పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈనెల 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం అలాగే 6వ తేదీ జర్నలిస్ట్ డే ను ఒకే వేదికపై నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుండి ఉన్నత స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దుతారని, సమాజంలో వ్యక్తిని ఉత్తముడిగా మలిచే శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు మరువలేనివని ఆమె కొనియాడారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు వాసవి వనిత క్లబ్ సభ్యులు శాలువాతో సహకరించి మెమెంటోళ్లను అందజేసి పెన్నులను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ జిల్లా సభ్యులు ఆలంపల్లి పద్మ, వాసవి క్లబ్ జిల్లా సభ్యులు నీల సంజీవ్ కుమార్, కోశాధికారి ఆలంపల్లి శిరీష, సముద్రాల సత్య, జర్నలిస్టులు కొమ్మినేని ఆంజనేయులు యాదవ్, సముద్రాల వేణు, హాథిరాం నాయక్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సముద్రాల రేణుక, చేరుపల్లి కళ్యాణి శ్రీనివాస్, రేపాల శ్రీనివాస్ తిరుమల తదితరులు పాల్గొన్నారు.