గాంధీనగర్ లో కొలువుదీరిన లంబోదర గణపయ్య..
దేవరకొండలోనే అతిపెద్ద గణపయ్య
తొమ్మిదేళ్లుగా భక్తులకు దర్శనమిస్తున్న గాంధీనగర్ గణనాథుడు
దేవరకొండ ………….
దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్ లో అతిపెద్ద లంబోదర గణపయ్య కొలువు తీరినాడు.
గత 9 సంవత్సరాలుగా దేవరకొండ వాసులకు దర్శనమిస్తున్న గణనాథుడు, ఈ ఏడాది మరింత ఘనంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు
గత 4 సంవత్సరాల నుంచి అధ్యక్షుడు గంజి సాయి కుమార్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది కూడా గణపయ్య కోరుకునే విధంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు అని అన్నారు
ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా గంజి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శిగా షఫీ, కోశాధికారిగా గంజి వంశీ వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తన్నీరు చంటి, కాసుల వంశీ, అంబటి మహేష్, ఏలా అరుణ్, వడ్త్య రాజు, హరీష్, బొడ్డుపల్లి, మాడెం మంజునాథ్, ఆదిత్య గోగికర్, ఆకాష్ గోగికర్, రిషికేష్ తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.
ఈ విఘ్నేశ్వరుని కనులారా చూడడానికి దేవరకొండ పరిసర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి తాము కోరుకున్న కోరికలు తీర్చమని గణపయ్యను వేడుకుంటున్నారు.
ఈరోజు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించినారు.