అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన సముద్రాల వేణు దంపతులు,,,

దేవరకొండ……
దేవరకొండ వాసవి మహిళలు దేవరకొండ లోని సంజయ్ కాలనీ లో హరి హర క్షేత్రం లో పార్వతి మాతకు ఆలంపల్లి దీపిక ఆధ్వర్యంలో అమ్మవారికి వాసవి మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి అమ్మవారి కి ప్రతినెల అమ్మవార్లకు ఒడిబియ్యం పోసే కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు సాయి ఆధ్వర్యంలో సముద్రాల వేణు దంపతులు హరిహర క్షేత్రం లో నాగుల పంచమి సందర్భంగా శివయ్యకు అభిషేకం నిర్వహించి
పార్వతి మాతకు కు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించినారు.
ఆలంపల్లి దీపిక మాట్లాడుతూ అమ్మవార్లకు ఒడిబియ్యం పోసే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు ఆ తల్లికి ఒడిబియ్యం పోసే అదృష్టం మా గ్రూప్ కు వచ్చినందుకు మా గ్రూపు సభ్యులు అందరం చాలా సంతోషం ఆనందంగా ఉన్నదని అని తెలియజేసినారు. అందరూ బాగుండాలి దాంట్లో మా గ్రూప్ సభ్యుల ఫ్యామిలీలు అందరం సంతోషంగా ఉండాలని కోరుతున్నాము అని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో సముద్రాల వేణు దంపతులు మానస వైష్ణవి, లహరి శ్రీ వర్ష ,నీల సంధ్యారాణి, ఆలంపల్లి దీపిక, పసుపుల ధనలక్ష్మి, పందిరి ఇందిరా, పందిరి శ్రీదేవి, నేలంటి శ్రీలత, నేలంటి సంధ్య, నూనె శ్రీవిద్య, వీరమల్ల స్వప్న,బెజవాడ దివ్య ,తదితరులు పాల్గొన్నారు.