ts: తమిళనాడు రాజకీయాల్లో ఈసారి పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ(TVK Party) అనూహ్యంగా గెలుపు దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఫలితాల్లో ఆ పార్టీ ముందంజలో ఉండటంతో మిగిలిన పార్టీలకు పెద్ద షాక్ తగిలింది…
Total Seats: 234/234..
Majority: 118.
Party Lead Won Total.
TVK 111 0 111
AIADMK+ 68 0 68
DMK+ 55 0 55
NTK 0 0 0
OTH 0 0 0 0
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమిళవెట్రి కజగం(టీవీకే) అవతరించింది. అధికార పీఠం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ట్రెండ్స్ లోనే 100 స్థానాల్లో టీవీకే అధిక్యంలో ఉంది. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం టీవీకే సుమారు 100కిపైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు డీఎంకే మూడో స్థానంలో కొనసాగుతుండగా, అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితితో డీఎంకే శిబిరంలో నిరాశ వాతావరణం కనిపిస్తోంది.
విజయ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. చెన్నై ప్రాంతంలోని అనేక నియోజకవర్గాల్లో టీవీకే ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా కొన్ని చోట్ల వెనుకంజలో ఉన్నట్లు సమాచారం.
ఈ ట్రెండ్ కొనసాగితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. ఒకవేళ స్పష్టమైన మెజార్టీ రాకపోతే హంగ్ పరిస్థితి రావచ్చని అంచనాలు ఉన్నాయి. అప్పుడు అన్నాడీఎంకే కూటమి టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే టీవీకే మాత్రం తమకే పూర్తి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. గెలిచే అభ్యర్థులను వెంటనే పార్టీ కార్యాలయానికి రప్పించాలని, భద్రత కారణాల దృష్ట్యా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు సమాచారం.
సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకేదే ఈసారి కూడా అధికారమని మె జారిటీ ఎగ్జిట్పోల్ సర్వేలు ప్రకటించాయి. ‘యాక్సిస్ మై ఇండియా’ మాత్రం విజయ్ పార్టీ ఏకంగా 120 వరకు సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. కాగా, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశముందన్న అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచేవారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపో ర్టు చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్టుకు తరలించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అయితే, వస్తున్న ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది…