డాక్టర్ రాములు నాయక్ చేసిన సేవలు చిరస్మరణీయం..దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

డాక్టర్ రాములు నాయక్ చేసిన సేవలు చిరస్మరణీయం
-పేద ప్రజల డాక్టర్‌గా ఎంతోమందికి సేవలందించారు
– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ……..
దేవరకొండ డాక్టర్ నేనావత్ రాములు నాయక్ పేద ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, పేద ప్రజల డాక్టర్‌గా ఆయన ఎంతోమందికి వైద్య సేవలు అందించారని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం డాక్టర్ నేనావత్ రాములు నాయక్ ప్రథమ వర్ధంతి సందర్భంగా చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన డాక్టర్ రాములు నాయక్ విగ్రహాన్ని రమావత్ రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ రాములు నాయక్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందిస్తూ, ఎంతోమందికి అండగా నిలిచారని కొనియాడారు. ఆపదలో ఉన్న వారికి వైద్యం అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఆయనను ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు.డాక్టర్ రాములు నాయక్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన సేవలు, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని రవీంద్ర కుమార్ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,మండల పార్టీ అధ్యక్షులు TVN రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, జార్పుల లోక్య నాయక్, వడ్త్య దేవేందర్ నాయక్, కేతావత్ హరిలాల్, వడ్త్య బాలు నాయక్, సర్పంచులు నేనావత్ భరత్, రమావత్ తులసీరాం, కౌన్సిలర్ అజయ్ చంద్ర, మాజీ కౌన్సిలర్ జయప్రకాశ్, నేనావత్ జైపాల్ నాయక్, నేనావత్ నాగార్జున నాయక్, కిషన్ నాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.