తీదేడు ముత్యాలమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలి – రమావత్ రవీంద్ర కుమార్ – దేవరకొండ మాజీ శాసనసభ్యులు

తీదేడు ముత్యాలమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలి

– రమావత్ రవీంద్ర కుమార్
– దేవరకొండ మాజీ శాసనసభ్యులు

చింతపల్లి ……..
చింతపల్లి మండలం
తీదేడు ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.చింతపల్లి మండలం
తీదేడు గ్రామంలో తిరుమణి పాపయ్య నిర్వహించిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర/ఉత్సవాల్లో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‌….ముత్యాలమ్మ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ప్రజలందరూ ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.గ్రామ ప్రజలకు,భక్తులకు ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,కేతావత్ బిల్య నాయక్, స్థానిక సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ,దేన్యతండ గ్రామ సర్పంచ్ రమావత్ కొండల్ నాయక్,తులసి రాం,బాలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్, దండేటికార్ ప్రసాద్,కాయితి బచ్చిరెడ్డి,మర్రు శ్రీనివాస రావు,మర్రు సురెందర్ రావు ,శివర్ల పర్వతాలు యాదవ్,దాసరి తిరుపతయ్య, తిరుమణి వెంకటయ్య, దాసరి ముత్తయ్య,ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.