జమ్మూకశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ కశ్మీరీలను పాకిస్థాన్ రక్షిస్తోందంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ కశ్మీరీలను పాకిస్థాన్ రక్షిస్తోందంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఫరూక్ వ్యాఖ్యలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఇవి దేశద్రోహపూరితమైన వ్యాఖ్యలని మండిపడింది. ఇందుకు ప్రతిగా ఫరూక్ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ డిమాండ్ చేశారు..భారత్‌లో ఉన్న స్వేచ్ఛ వల్లే ఫరూక్ తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నారని, అదే పాకిస్థాన్‌లో ఉంటే ఇంత స్వేచ్ఛ ఉండేదా? అని సత్ శర్మ ప్రశ్నించారు. ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు, కశ్మీర్‌లోని పలు వర్గాలకు న్యాయమైన హక్కులు, హోదాలు దక్కలేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన అన్నారు..
ఫరూఖ్‌పై చర్య తీసుకోవాల్సిందే!.
Farooq Abdullah:
ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ మండిపడ్డారు. “ఫరూక్ పాకిస్థాన్‌కు అనుకూలంగా చేసిన ఈ ప్రకటన దేశద్రోహపూరితమైనది, దేశవ్యతిరేకమైనది. ఇలాంటి వాఖ్యలు చేసినందుకు అతనిపై పోలీస్ కేసు నమోదు చేయాలి. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు ఎవరూ, పాకిస్థాన్ వాదనకు రాజకీయ చట్టబద్ధత కల్పిస్తూ మాట్లాడడం సరికాదు. అబ్లుల్లాకు పాకిస్థాన్ అంటే అంత ఇష్టమైతే, అతను అక్కడికే వెళ్లాలి. వాస్తవానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్ దుష్పరిపాలన నుంచి స్వేచ్ఛ కోరుతున్నారు. వారు భారత్‌లో చేరాలని కోరుకుంటున్నారు. అందుకే ఇక్కడ పాకిస్థాన్‌ను కీర్తించడం మానేసి, క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవడం మంచిది” అని చురకలు అంటించారు.
“పాకిస్థాన్ కశ్మీర్‌కు ఉగ్రవాదం, రక్తపాతం, భయం, అనిశ్చితి తప్ప మరేమీ ఇవ్వలేదు. అలాంటి కశ్మీర్ ప్రజలు ఈ బాధాకరమైన చరిత్రను మరిచిపోయి, పాకిస్థాన్ తమ రక్షకుడని నమ్ముతారని ఫరూక్ అబ్దుల్లా ఆశిస్తున్నారా?” అని ఠాకూర్ నిలదీశారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన భద్రతా సిబ్బంది, పౌరులు చేసిన త్యాగాలను నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు గుర్తించడంలో విఫలమవుతున్నారా?” అని ఆయన ప్రశ్నించారు.
కశ్మీర్‌ను విడదీసే డిమాండ్‌ను కాంగ్రెస్ సమర్థిస్తోందా? జామియా నినాదాలపై క్లారిటీ ఇవ్వాలన్న బీజేపీ ప్రశ్నిస్తుంది..
పాకిస్థాన్‌కే పోండి!
ఫరూక్‌కు పాకిస్థాన్‌పై అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లి స్థిరపడొచ్చని సత్ శర్మ చురకలంటించారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక అధికారాల వల్లే ఫరూక్ అబ్దుల్లా ఇలా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో, ఎవరైనా కశ్మీర్ వైపు కన్నెత్తి చూస్తే తగిన గుణపాఠం చెబుతున్నామని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని సత్ శర్మ తేల్చిచెప్పారు.
ఫరూక్ ప్రేలాపనలు
ఇంతకు ముందు ఫరూక్ అబ్లుల్లా మాట్లాడుతూ, కశ్మీర్‌పై అనవసర ప్రేలాపనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కశ్మీరీలకు పెద్దగా ఆశలు లేవని అన్నారు. “దిల్లీపై మీకు (జమ్మూకశ్మీర్ ప్రజలకు) ఏం ఆశ ఉంటుంది? వారు మీకు న్యాయం చేస్తారని ఆశిస్తారా?” అని ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఫరూక్ అన్నారు. అంతేకాదు దిల్లీని ఎదుర్కొనే ధైర్యం కశ్మీరీలకు ఉండాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. “మీరు కశ్మీర్‌ను కాపాడుకోకపోతే, మీరు నాశనమవుతారు. మీ జాడ, గుర్తింపు కూడా కనుమరుగవుతాయి. ఏమీ మిగలదు. ప్రపంచమంతటా గందరగోళం నెలకొని ఉంది. అందుకే వారు ఈ రోజు మౌనంగా ఉన్నారు. అయితే ఈ కశ్మీర్ సమస్య సజీవంగా ఉండడం వెనుక మన పొరుగుదేశం (పాకిస్థాన్) ఉంది. ప్రతిచోటా కశ్మీర్ విషయాన్ని వాళ్లు లేవనెత్తుతున్నారు. అదే మిమ్మల్ని కాపాడుతోంది. లేకపోతే వారి ఉద్దేశాలు మంచివి కావు” అని ఫరూక్ అన్నారు..