ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్( పుష్ప 2)..!

ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్( పుష్ప 2)

ఈ అవార్డుతో చిరంజీవి (7 ఫిలిం ఫేర్ అవార్డ్స్) రికార్డును సమం చేసిన అల్లు అర్జున్..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడి (తెలుగు) అవార్డును గెలుచుకున్నారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రదానోత్సవం కేరళలోని కొచ్చి నగరంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ఈ పురస్కారం అందుకోవడంపై అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “ఈ అద్భుతమైన గౌరవాన్ని అందించిన ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు. నన్ను ప్రత్యేకంగా అభిమానించే ఈ గడ్డపై అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరి ఆశీర్వాదాలకు నేను వినమ్రతతో ఉన్నాను. నాపై అనంతమైన ప్రేమను కురిపిస్తున్న నా అభిమానులందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను” అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌కు ఇది ఏడో ఫిల్మ్‌ఫేర్ అవార్డు కావడం విశేషం. దీంతో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన రికార్డును అల్లు అర్జున్ సమం చేశారు..