పామునే మింగేసిన కప్ప…

అదొక నిర్మానుష్య అటవీ ప్రాంతం. చుట్టూ చెట్లు, ఎండిన గడ్డితో కూడిన ఆ ఏరియాలోకి ఒక గ్రీన్ కలర్ కప్ప వచ్చింది. బహుశా ఆహారం కోసం పురుగులను వెతుకుతోంది. అంతలోనే ఆహార వేటలో భాగంగా ఒక పాము కూడా ఈ ప్రాంతంలోకి వచ్చింది. సాధారణంగా పాములు కప్పలను తింటాయి. కప్పలు చిన్న చిన్న పురుగులను తింటాయి. ఇది వాటి ఆహారపు అలవాట్లలో భాగం. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్‌ అయింది. ఎకప్పే పామును నోటితో కరిచి మింగసాగింది. ఈ సందర్భంగా పాము, కప్ప మధ్య పెనుగులాట జరిగినప్పటికీ, కప్పదే పైచేయి అయింది. పామును నోటితో కరిచి, కాళ్లతో లోపలికి నెట్టుకుంటూ మింగేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకాలస్యం మీరూ చూసేయండి!
https://www.instagram.com/reel/DJtvypJyEOT/?igsh=ajQ3dms0a2h6bHBz