కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంపు..

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలో భారీ పెంపు చోటుచేసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.993 వరకు పెంపు ప్రకటించడంతో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,071కు చేరింది.
ఈ పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ధరల పెంపు ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై పడే అవకాశం ఉండగా, చివరికి సామాన్య వినియోగదారులపై భారం పెరగనుంది.