తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేసిన ఉద్యమకారులను మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం: కొండ హరీష్ గౌడ్..
ఈరోజు భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్.
ఈ సందర్భంగా హుజూర్ నగర్ బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని పాలించినటువంటి గత ప్రభుత్వం కానీ ఈరోజు పాలిస్తున్న ప్రభుత్వం గానీ తెలంగాణ రాష్ట్ర ఆశయాలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయాయని, నాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కానీ గత మరియు నేటి ప్రభుత్వాలు ఈ మూడింటిని వదిలేసి వారి పదవుల కొరకు, వారు ఆస్తులు సంపాదించుకోవడానికి ఈ విధంగా పూర్తిగా వారి స్వలాభం కొరకు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఆత్మగౌరవ విషయమని దీని కోసం నాడు సుమారు 1400 మంది అమరవీరులు బలిదానం అయ్యారని అంతవరకు నాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనికరం కలగలేదని అదే సమయంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి పక్ష నేత, తెలంగాణ చిన్నమ్మ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమరుల యొక్క ఆశయాలను మరియు నీళ్లు, నిధులు, నియామకాలను పూర్తిస్థాయిలో సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సోమగాని ప్రదీప్ గౌడ్, బెల్లంకొండ నరేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు గుండా గోపి, రాళ్లబండి రామారావు, పట్టణ కార్యదర్శి చుక్క హరీష్, పులి నరసింహారావు, పందిళ్ళపల్లి మురళి, ఫణి తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.