లేడీస్ హాస్టల్ భవనంలోని బాత్రూమ్‌లో యువతి మృతి..!

హైదరాబాద్‌లో యువతి అనుమానాస్పద మృతి
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భార్గవి లేడీస్ హాస్టల్ భవనంలోని బాత్రూమ్‌లో హారిక అనే యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

హారిక రెండు రోజుల క్రితమే మృతి చెందిన ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతురాలు గుంటూరు జిల్లాకు చెందినదిగా గుర్తించారు.

టెర్రస్‌పై ఒంటరిగా నివసిస్తున్న హారిక… బాత్రూమ్‌లో జారి పడడంతో మృతి చెందిన ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.