విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే రాక్షసుల్లా మారారు…
క్రమశిక్షణ పేరుతో ఒక విద్యార్థిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, ఆమె మృతికి కారణరమైన దారుణ ఘటన నగరంలోని మల్కాజిగిరి (Malkajgiri) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి 3.. మల్కాజ్గరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వర్షిణి (Varshini) అనే విద్యార్థిని ఒక రోజు కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చింది. అదే సాకుగా (Sri Lakshmi), మధురిమ (Madhurima)లు ఆమెను తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి నరకం చూపించారు. కాలేజీకి ఎందుకు లేటుగా వచ్చావు….
పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు..
హైదరాబాద్ కాలేజిలో దారుణ ఘటన..
అవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతి..
సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి కలకలం..
మల్కాజిగిరికి చెందిన విద్యార్థిని (17) కాలేజీకి ఆలస్యంగా వచ్చిందని లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ క్లాస్లకు అనుమతించకపోగా, పీరియడ్స్ వచ్చాయని చెబితే.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు అంటూ దురుసుగా ప్రవర్తించడంతో మానసికంగా కుంగిపోయి.. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలిన విద్యార్థిని
ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి మృతి చెందినట్టు తెలిపిన డాక్టర్లు.
కాలేజీ ముందు తోటి విద్యార్థులు, విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆందోళన..
కాలేజీలో జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక వర్షిణి ఒక్కసారిగా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ మాటలే గుర్తొచ్చి తీవ్ర మానసిక వేదన అనుభవించింది. ఈ క్రమంలో ఇంట్లోనే తలతిరిగి పడిపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వర్షిణి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు వర్షిణి మృతికి లెక్చరర్ల వేధింపులే కారణమని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కళాశాల ముందు భారీ ఆందోళన చేపట్టాయి. విద్యార్థినిని మానసికంగా వేధించిన శ్రీలక్ష్మి, మధురిమలను వెంటనే అరెస్టు చేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు..