హుజూర్నగర్ పట్టణ ప్రజలకు స్థానిక తాసిల్దార్ కవిత తెలిపిన వివరాలు ప్రకారం..
సీతారామస్వామి గుట్ట – హుజూర్నగర్ ఇండ్ల కేటాయింపులకు సంబంధించిన దరఖాస్తుల విషయంలో కొందరికి అవగాహన లేకపోవడంతో ఆరు గ్యారెంటీలలో అప్లై చేశారు కాబట్టి ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని కొందరు ప్రచారం చేస్తున్నట్లు, అది తప్పు అని తెలిపారు….
సింగిల్ బెడ్ రూమ్ కావాలనే ప్రతి నిరుపేద కుటుంబం కూడా స్థానిక తాసిల్దార్ కార్యాలయంకు వచ్చి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వార్డ్ గా వారికి కేటాయించిన కౌంటర్లో మాత్రమే అప్లై చేయాలని తెలిపారు..
హుజూర్ నగర్ స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుంది..
దరఖాస్తుల స్వీకరణ కాలం.
ఈరోజు నుండి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే.
హుజూర్నగర్ M.R.O కార్యాలయంలో
గమనిక:
20వ తేదీ తరువాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు.
అర్హులైన వారు నిర్ణీత గడువులోనే తప్పనిసరిగా దరఖాస్తులు సమర్పించవలసిందిగా తెలియజేయడమైనది..
తప్పనిసరిగా సమర్పించవలసిన పత్రాలు:.
దరఖాస్తు ఫారాలు:
అన్ని ఇంటర్నెట్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి.. దరఖాస్తు తో పాటు.
• ఆధార్ కార్డు
• కుల ధృవీకరణ పత్రం
• రేషన్ కార్డు.
రద్దీ దృష్ట్యా, అర్హులైన ప్రజలు ఆలస్యం చేయకుండా తొందరగా దరఖాస్తు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు..
కౌంటర్ వారీగా వార్డుల కేటాయింపు.
• కౌంటర్ నెం. 1: 1వ వార్డు నుండి 7వ వార్డు వరకు
• కౌంటర్ నెం. 2: 8వ వార్డు నుండి 14వ వార్డు వరకు
• కౌంటర్ నెం. 3: 15వ వార్డు నుండి 21వ వార్డు వరకు
• కౌంటర్ నెం. 4: 22వ వార్డు నుండి 28వ వార్డు వరకు అప్లై చేయడానికి కౌంటర్లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు..
దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు.. ఇల్లు పంపిణీ పారదర్శకంగానే ఉంటుందని తెలిపారు..
strong>గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959