ఆటాడుకుంటున్న నెటిజన్లు…కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు పై క్రికెట్ ఫ్యాన్స్ జోక్ లు…!

ఆటాడుకుంటున్న నెటిజన్లు..

క్లియర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన రోహిత్ శర్మ..

ఇటీవల రోహిత్ శర్మ పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ” రోహిత్ పూర్తిస్థాయిలో శరీర సామర్థ్యాన్ని కలిగి ఉండడు. అతడు లావుగా ఉంటాడు. కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాగా కనిపించడు. పైగా వేగంగా పరుగులు తీయడంలో ఇబ్బంది పడతాడు. రోహిత్ లావుగా ఉంటాడని” షామా మహమ్మద్ వ్యాఖ్యానించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించాయి. దీనిపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో.. సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. అయితే ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో షామా మహమ్మద్ పై రోహిత్ అభిమానులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. “షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు బలమైన ప్రభావాన్ని చూపించాయి. అందువల్లే రోహిత్ ఆ స్థాయిలో ఆడుతున్నాడని” వారు వ్యాఖ్యానిస్తున్నారు. “రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు అంత లావుగా ఉన్నప్పటికీ ఆడుతున్నాడు. కొంతమంది ఏవేవో విమర్శలు చేశారు. అయినప్పటికీ అతడు దేశం కోసం మాత్రమే ఆడుతున్నాడు అతడి ఆటను ప్రపంచం మొత్తం ఆస్వాదిస్తోంది ఇలాంటి సమయంలో కొంతమంది చెవులు మూసుకోవాలి. కళ్ళు కూడా మూసుకోవాలి. రోహిత్ అంటే ఏంటో తెలియని వారు విమర్శలు చేస్తే.. ఎంతటి స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందో వారికి తెలిసింది. ఇకపై అలాంటి విమర్శలు చేయకుండా ఉండడం మంచిదని” రోహిత్ అభిమానులు పేర్కొంటున్నారు.