భారత్-ఇటలీ బంధాలను మరింత బలోపేతం చేసేందుకు కీలక చర్చలు..
Narendra Modi ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని Giorgia Meloni తో డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం Colosseum ను సందర్శించారు.
ఇద్దరు నేతలు పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. భారత్-ఇటలీ స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ, గ్లోబల్ భాగస్వామ్యాలపై ఇవాళ జరిగే అధికారిక సమావేశాల్లో మరింత లోతైన చర్చలు జరగనున్నాయి.
ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం పెరుగుతున్న వేళ… కీలక దేశాలతో వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఈ భేటీతో మరోసారి స్పష్టమైంది..
భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ (ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం) స్థాయికి పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇటలీ రాజధాని రోమ్లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల అధినేతలు ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. భారత్-ఇటలీ సంబంధాలు ఇప్పుడు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకునే స్థాయికి చేరుకున్నాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు….చరిత్రలోనే అత్యున్నత స్థాయికి సంబంధాలు: మెలోని
India-Italy
భారత్, ఇటలీల మధ్య ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ ప్రకటనను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వాగతించారు. ఇరు దేశాల చరిత్రలోనే ఇదొక అత్యున్నత స్థాయి దౌత్య సంబంధమని ఆమె అభివర్ణించారు. గత మూడేళ్ల కాలంలో ప్రధాని మోదీతో తాను జరిపిన ఏడు సమావేశాలు ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, నమ్మకంతో కూడిన బలమైన స్నేహ బంధాన్ని ఏర్పరిచాయని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని, ఆయనకున్న ప్రజాదరణను మెలోని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు..