కోమటిరెడ్డి మీద వీడియో చేయమని ప్రోత్సహించిన చెత్త నా కొడుకు ఎవడో నిజంగా వాడు మగాడైతే ముందుకు రావాలి, వాడిని చెప్పుతో కొడతా – మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీడియో స్పందించిన జగ్గారెడ్డి..

కోమటిరెడ్డి మీద వీడియో చేయమని ప్రోత్సహించిన చెత్త నా కొడుకు ఎవడో నిజంగా వాడు మగాడైతే ముందుకు రావాలి, వాడిని చెప్పుతో కొడతా – మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యక్తిత్వానికి సంబంధించిన రాజకీయాలు సరికాదని.. కోమటిరెడ్డి వంటి నాయకులపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో కష్టంతో కూడుకున్నదని జగ్గారెడ్డి గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి అయ్యారని.. ఆయన చరిత్రపై బురద జల్లడం తగదని హెచ్చరించారు…
ఒక ఆడ, మగ మాట్లాడితే పెడార్థాలు తీస్తారా? అంటూ ఆయన దుమ్మెత్తి పోశారు. పనిగట్టుకుని బురద జల్లడానికి ఇదేమైనా ప్రజా సమస్యనా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రాయడానికి బదులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను బయటకు తీసుకురావాలని సూచించారు. చేతిలో కలం ఉందని ఇష్టారీతిన రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అప్పులు చేసి ప్రజలకు సేవ చేసే మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.