కవిత నాయకత్వంలో ఏర్పాటు కానున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు తరలిన జాగృతి శ్రేణులు…!

కవిత నాయకత్వంలో ఏర్పాటు కానున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు హుజూర్ నగర్ నుండి భారీగా తరలిన జాగృతి శ్రేణులు.

తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం కవిత నాయకత్వంలో ఏర్పాటు కానున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి భారీగా జాగృతి శ్రేణులు తరలి వెళ్ళారు..

ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర్ర నాయకులు KLN రావు, యారం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ BRS పది సంవత్సరాలు మరియు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రజాల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుక గా నూతన రాజకీయ శక్తిగా కవిత రావడం శుభ పరిణామం అన్నారు

సభకు తరలి వెళ్లిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె గోవర్ధన్, బండి రాహుల్,M బిక్షం,మామిడి పన్నీరు, నర్సింహా రావు,Y చంటి, గుండు శ్రీను,గోపి,నజీర్, పద్మ, శాంతి, కిరణ్ రెడ్డి ,వెంకటేష్,ప్రకాష్, నాగు నాయక్ తదితరులు వెళ్ళారు