*🔹నేను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జానారెడ్డి*
https://youtu.be/OnxldcA9wKc?si=mlaFhtNspH3joP68
*గాలి మాటలు మాట్లాడితే కుదరదు..జానారెడ్డి.*
కులగణన విషయంలో తీన్మార్ మల్లన్న తన గురించి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు.
‘కులగణన అంశంలో నా పాత్ర లేదు. గాలి మాటలు మాట్లాడితే కుదరదు.
ఇన్వెస్టిగేషన్ చేసి నా దగ్గరికి వచ్చి మాట్లాడితే వివరణ ఇస్తా.
ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరం.
నన్ను ప్రేమించే ప్రజలు, పరిపాలన చేసే వారు అడిగితే సలహాలు, సూచనలు ఇస్తాను… తెలంగాణ ఇన్చార్జ్ రొటేషన్ పద్ధతిలో ఉంటుంది… ఒకరికొకరు మారుతూనే ఉంటారు కొత్తవారు వస్తూనే ఉంటారు..
కులగణన అంశంలో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు.. అందులో నా పాత్ర లేదు.’ అని జానారెడ్డి అన్నారు