నేటి పంచాంగం…_నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 06 – 03 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *సప్తమి* మ3.39 వరకు,
నక్షత్రం : *రోహిణి* తె4.34 వరకు,
యోగం : *విష్కంభం* రా12.53 వరకు,
కరణం : *వణిజ* మ3.39 వరకు
తదుపరి *విష్ఠి* రా2.41 వరకు,

వర్జ్యం : *రా9.00 – 9.31*
దుర్ముహూర్తము : *ఉ10.14 – 11.01,*
మరల *మ2.55 – 3.42,*
అమృతకాలం : *రా1.32 – 3.03,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.20,
సూర్యాస్తమయం: 6.03,

*_నేటి మాట_*

*ప్రార్థన ఎలా చేయాలి ??? – ఎవరికోసం చేయాలి???*
‘దివ్యత్వం జీవనానికి ఆధారం’.
ప్రాణము నకు, ఆధారము ఎవరు? అని శిష్యుడు, తన గురువైన పిప్పలాదుని ప్రశ్నించాడు.
దానికి గురువు – మూలాధార ము లేనిదే, ఏదీ చేయటానికి వీలు లేదు కదా!

నీరు చైతన్య మైనది, మంచుగడ్డ జడ మైనది, ఒకటి ద్రవం, మరొకటి ఘనం…

కానీ,.. ఐసుగడ్డలో ఉన్నది కూడ నీరే…! నీటితో కొడితే దెబ్బ తగలదు కాని, ఐసు తో కొడితే దెబ్బ తగులుతుంది, దీనికి ఆ శక్తి ఎక్కడనుండి వచ్చింది?

అతీతమైన, చలిగాలి సంపర్కము చేత, నీరే ఘనంగా మారిపోయింది, దీనికి అతీతమైన గాలే ఆధారం.

అదేవిధంగా, ప్రాణానికి, అతీతమైన తత్వము మరొకటి ఉంది.
దాని సంబంధము చేతనే – ప్రాణ తత్వము సర్వ జీవులను పోషిస్తూ, రక్షిస్తూ, శిక్షిస్తూ ఉంటున్నది.
ఆ అతీతమైన తత్వము ను, పదములలో చెప్పడానికి లేదు, అనుభూతి లో చూడాలి.

*ఎట్లా?…*
కంటికి కనిపించని మాత్రమున గాలి లేదని చెప్పగలవా?మరి గాలి లేక నీవెట్లు జీవింపగలుగుతావు.
మొట్టమొదట, నీ తృప్తి కాదు, దైవ తృప్తి కోసం పాటుపడు, నీవు నీ కోసం దైవాన్ని ప్రార్ధించటం , అలవాటు చేసుకున్నావు, అదే స్వార్ధము.
దైవంకోసం ప్రార్థన చేయు, ఆయన తప్పక అనుగ్రహిస్తాడు…

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏