బ్రెయిన్ లెస్ ఎంపీ గా మారిపోయారు..ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…

బ్రెయిన్ లెస్ ఎంపీ గా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతులకు బండి సంజయ్ రాసిన లేఖలో అబద్దాలు తప్ప ఏమీ లేవని విమర్శించారు. బట్టేబాజ్ గ్యాంగు కు లీడర్ బండి సంజయ్ అని అన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణకు నలువైపులా శనిలా మారారని ఆరోపించారు. రైస్ మిల్లర్లతో సీఎం కేసీఆర్ కుమ్మక్కు ..అంటూ ఎవరూ నమ్మని మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. బడా వ్యాపార వేత్తలకు11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి మోసగాళ్లను దేశం దాటించిన పార్టీ బీజేపీ అని అన్నారు. అసలు బండి సంజయ్ తెలంగాణలో పుట్టాడా గుజరాత్ లో పుట్టాడా అనే అనుమానం కలుగుతోందన్నారు. వడ్లు కొంటారా కొనరా అంటే బాండ్ పేపర్ ఎంపీ అర్వింద్ బోధన్ లోఎవరికీ అర్థం కానట్టు మాట్లాడారన్నారు. గతం లో ధాన్యం సేకరణ జరిగినపుడు 17 వేల కోట్ల నష్టం రాష్ట్రం భరించిందన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మొక్కజొన్నలు,ఎర్ర జొన్నల విషయంలో మరో మూడు వేల కోట్ల రూపాయల నష్టాన్ని రాష్ట్రం భరించిందని తెలిపారు…