బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి..
బీఆర్ఎస్ లో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని ప్రజల పక్షాన నేను మాట్లాడితే తనను కక్ష కట్టి బయటకు పంపించివేశారని మండలిలో కవిత చేసిన కామెంట్స్ రాజకీయంగా సెన్సేషనల్ గా మారాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఈ విషయాన్ని తాను ఆనాడే అడ్డుచెప్పానని కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ (BRS Party) శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు తనకు తెలియదని ఈ మార్పును నేను ఒప్పుకోలేదని అనడం సబబు కాదని, పేరు మార్చడం మీకు ఇష్టం లేకపోతే మరి తెలంగాణ జాగృతి పేరును (Telangana Jagruthi) భారత్ జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పగలరా?అని ప్రశ్నిస్తున్నారు. అలాగే 2022 డిసెంబరు 9న తెలంగాణ భవన్లో జరిగిన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్, పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు కవిత తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై ‘జననేతకు జయహారతి. న్యూ స్టార్ట్, న్యూ మిషన్ బై ద లీడర్ విత్ ఏ విజన్, కేసీఆర్ గారు. విజయీభవ జై భారత్ జై తెలంగాణ’ అని రాస్తు కేసీఆర్ కు వీరతిలకం దిద్దిన ఫోటోను కవిత షేర్ చేశారు. నాడు కవిత చేసిన ఈ పోస్టును బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నాయి..
నాకు సపోర్ట్ ఇవ్వలేదు. రాజకీయ కక్షలతో నన్ను జైల్లో పెట్టారు. ఎప్పుడూ కూడా నాకు పార్టీ అండగా లేదు. బీఆర్ఎస్లో డిసిప్లినరీ కమిటీ అనేది పెద్ద జోక్. నా అభిప్రాయం తెలుసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. ఎలాంటి నైతికత లేని బీఆర్ఎస్ నుంచి వైదొలుగినందుకు సంతోషిస్తున్నాను. ఉద్యమకారులను, మనకు సపోర్టు ఇచ్చిన వాళ్లను పార్టీ గుర్తించలేదు. పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. రాజకీయ పార్టీలు ఒక దిక్సూచిగా ఉండాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది.
ధర్నా చౌక్‌ను రద్దు చేయడం ప్రజాస్వామ్యక హక్కును హరించడమే అవుతుంది. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు చేశారు. సెక్రటేరియట్లో కొత్త కలెక్టరేట్లో చాలా అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లతో తీవ్రంగా అవినీతి బయటపడింది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయమని.. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వమని అడిగాను. నేరెళ్ల ఘటనలో ఇసుక దందాతో దళిత బిడ్డలు బలైపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపై చర్యలు తీసుకోవట్లేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వంద సార్లు అడిగాను. కానీ ప్రభుత్వం స్పందించలేదు. కేసీఆర్ కింద ఉన్న వ్యక్తులు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారుస్తామని చెప్పినప్పుడు నేను వద్దని చెప్పాను. .
strong>గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959