బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. బుధవారం (మార్చి 12) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెషన్లో పాల్గొనేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు..హైదరాబాద్లోని నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు అసెంబ్లీ ప్రాంగణం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. బుధవారం (మార్చి 12) మాత్రం సెషన్ ప్రారంభానికి గంట ముందే అంటే ఉదయం 10 గంటలకే అసెంబ్లీకి రావడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీకి రాలేదు. మళ్లీ బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు.
అసెంబ్లీలోని ఎల్పీ ఆఫీసులో ఉన్న కేసీఆర్ ను.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవటం ఆసక్తిగా మారింది. గూడెం మహిపాల్ రెడ్డి.. తన తమ్ముడి పెళ్లికార్డును స్వయంగా కేసీఆర్ కు అందజేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా కేసీఆర్ ను కలిశారు. దీనిపై ఆయనే స్పందించారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్లే కావటం విశేషం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి.. కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలిచారు..
ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాలను బుధవారం నుంచి అంటే మార్చి 12 నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కూడా బిల్లులు ప్రవేశపెట్టాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం వీటికి సంబంధించిన బిల్లులను ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. వాటి ప్రకారమే సిద్ధం చేసిన బిల్లులను ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో పలు ఇతర అంశాలపై కూడా కేసీఆర్.. పార్టీ నేతలతో చర్చించారు..
ఆరోగ్యం ఎలా ఉంది సార్ అంటూ. కెసిఆర్ ని పరామర్శించిన ఎమ్మెల్యేలు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లి తనని పరామర్శించడంతో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
గూడెం మహిపాల్ రెడ్డి.. తన తమ్ముడి పెళ్లికార్డును స్వయంగా కేసీఆర్ కు అందజేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా కేసీఆర్ ను కలిశారు. దీనిపై ఆయనే స్పందించారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆదినారాయణ వెల్లడించారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ ఆయన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం..