గులాబీబాస్ డైరెక్షన్.. బావబామ్మర్దుల యాక్షన్. కట్ చేస్తే.. కారు పార్టీ జోరు మీద కనిపిస్తోంది. కేసీఆర్ దిశానిర్ధేశంలో కేటీఆర్, హరీశ్ రావు ఏకతాటిపై దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వీళ్లిద్దరూ ఈసారి సీరియస్గా వర్కవుట్ చేస్తున్నారు.
అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో.. పార్టీని ఏకతాటిపై ముందుకు తీసుకుపోవడంతో తొలిసారి ఈ ఇద్దరూ ఒక్కటై తమదైన స్టైల్లో ముందుకు వెళ్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని జోష్ ఇప్పుడు కారు పార్టీలో కన్పిస్తోంది
ఓ వైపు జూబ్లిహిల్స్ బైపోల్.. మరోవైపు రాబోతున్న స్థానిక ఎన్నికలు.. ఇలాంటి పరిణామాల మధ్య.. తెలంగాణ రాజకీయం రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతోంది. రేవంత్ సర్కార్పై తగ్గేదే లే అని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దూకుడే దీనికి కారణం అనే చర్చ జరుగుతోంది. ఎర్రవల్లి ఫాంహౌస్లో అధినేత కేసీఆర్ తో వరుస సమావేశాల తర్వాత… కేటీఆర్, హరీష్ రంగంలోకి దిగారని తెలుస్తోంది..
.