తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కాదు… కాంగ్రెస్ పార్టీ తల్లి ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కాదని… కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహావిష్కరణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు…తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ తల్లి మన అస్తిత్వం చాటేలా ఉండాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అలా లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరాలిగా రూపొందించారని, అలా ఉండాలని ఎవరూ కోరుకోరన్నారు.శిల్పశాస్త్రం ప్రకారం ఉండాల్సిన లక్షణాలన్నీ కేసీఆర్ హయాంలో రూపొందించిన విగ్రహంలోనే ఉన్నాయన్నారు. బీదరికం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా?…కోహినూర్ వజ్రం లభించిన ఈ నేలలో తెలంగాణ తల్లికి విగ్రహం ఉండకూడదా? అని ప్రశ్నించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ పాడిన ఈ నేల తల్లి మెడలో రత్నాలు ఉండవద్దా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మీద అక్కసుతో విగ్రహాన్ని మార్చి, బతుకమ్మ లేకుండా తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు…
విదేశీ శక్తులు ఆక్రమణకు వస్తే.. భారతీయులేమైనా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటారా?..మమతా బెనర్జీ.
బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు..విదేశీ శక్తులు ఆక్రమణకు వస్తే.. భారతీయులేమైనా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటారా? అని అన్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశాలపై తమకు హక్కు ఉందంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు వ్యాఖ్యల నేపథ్యంలో దీదీ ఈ విధంగా స్పందించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కొందరు బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. కేంద్రం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా పశ్చిమబెంగాల్ కట్టుబడి ఉంటుందన్నారు. ఇదే సమయంలో బంగ్లాలో కొందరు చేసే రెచ్చగొట్టే ప్రకటనలకు స్పందించవద్దని, సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన దేశ విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్‌లో ఉన్నారని, ఇక్కడున్నవారు అనవసరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై జరుగుతోన్న దాడులు, అక్కడి నేతల వ్యాఖ్యలను మన రాష్ట్రంలోని ఇమామ్‌లు కూడా ఖండించారు. అక్కడ పరిస్థితులు దిగజారితే మన బంధువులు, మిత్రులపైనా పడుతుంది. అందుకే ఏదైనా వ్యాఖ్యానించేటప్పుడు సంయమనం పాటించండి. రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు మనందరం కలిసి పనిచేయాలి” అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
పశ్చిబెంగాల్, బిహార్, ఒడిషాలపై తమ దేశానికి చట్టబద్ధ హక్కులు ఉన్నాయంటూ ఇటీవల ఢాకాలో ఏర్పాటు చేసిన సభలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు పేర్కొనడం చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై స్పందించిన మమతా బెనర్జీ.. మన భూమిని ఎవరైనా ఆక్రమించుకోవడానికి వస్తే భారతీయులు ఏమైనా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటారా? అని ప్రశ్నించారు. భారత విదేశాంగశాఖ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, తృణమూల్ పార్టీ తప్పకుండా పాటిస్తుందని చెప్పారు..ఇదిలాఉంటే, బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్, సలహాదారు తౌహిద్ హుస్సేన్‌లతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హిందువులు, మైనారిటీల భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ సహా భారత సరిహద్దుల్లో బంగ్లా దళాలు డ్రోన్ల మోహరించడంపైనా మాట్లాడామన్నారు..
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు..
మంత్రివర్గ విస్తరణలో భాగంగా..
ఏపీ అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం 25 మంత్రి పదవులు ఉండాల్సి ఉంటే, ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది.
జనసేనకు కొత్త స్థానం
ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. అయితే కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం, జనసేనకు నాలుగు మంత్రి పదవులు, బీజేపీకి ఒక పదవి కేటాయించాల్సి ఉంది. అందులో భాగంగా ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. ఇక రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం బీద మస్తాన్, సానా సతీష్ పేర్లను ఖరారు చేశారు…
బన్నీని అభినందించిన చిరంజీవి..!
పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. హిందీ వెర్షన్ లో ఈ సినిమాకు అనూహ్య ఆదరణ దక్కుతోంది…అక్కడే ఈ సినిమాకు దాదాపు రూ.700 నుంచి రూ.800 కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య దూరం పెరిగింది.. ఈ రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదు అనే విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ రెండు కుటుంబాలకు చెందిన అభిమానులు నిత్యం కొట్లాడుకుంటారు. సాయిధరమ్ తేజ్ మినహా మెగా హీరోలెవరూ పుష్ప2పై స్పందించలేదు.
బన్నీని అభినందించిన చిరంజీవి
ఇటువంటి తరుణంలో పుష్ప2 విజయం సాధించినందుకు అల్లు అర్జున్ ను చిరంజీవి అభినందించారని, తాను బన్నీకి పెద్ద అభిమానిని అన్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బన్నీకి స్వీట్ తినిపించే ఫొటో వైరలవుతోంది. ఈ ఫొటోలో చిరంజీవి శ్రీమతి సురేఖ కూడా ఉన్నారు. పుష్ప2 ఘనవిజయానికి బన్నీని అభినందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ నిజమైన వార్తలు కాదని తేలింది. పుష్ప1 సినిమాకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది. ఆ సమయంలో బన్నీని ఇంటికి పిలిపించిన చిరంజీవి తీపి తినిపించి బాగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. అప్పుడు సంబంధించిన ఫొటో అది.
రెండు కుటుంబాలు కలిసిపోవాలని కోరుకుంటున్న అభిమానులు
అయితే కొందరు పుష్ప2 సందర్భంగా బన్నీని పిలిపించి అభినందించారంటూ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇంతవరకు చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, శ్రీజ, సుస్మిత.. ఇలా ఎవరూ కుటుంబానికి చెందినవారెవరూ స్పందించలేదు. పుష్ప విజయోత్సవ వేడుకలో బన్నీ పవన్ కల్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడంతోపాటు మనస్ఫూర్తిగా తాను చెబుతున్నట్లు థాంక్స్ బాబాయ్ అన్నారు. ఇకనుంచైనా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలని, రెండు కుటుంబాలు కలిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి దానికి మెగా కుటుంబంకానీ, అల్లు అరవింద్ కుటుంబంకానీ స్పందిస్తుందేమో చూడాలి మరి..
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తీవ్ర విమర్శలు గుప్పించారు..రాహుల్‌ను కామెడీ కింగ్‌గా అభివర్ణించారు. ఆయన నిరంతరం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రాహుల్ ఉత్తమమైన స్టాండ్ ఆఫ్ కామెడీలో మునిగిపోయారు. ఆయన చేసిన దురుద్దేశపూరిత ఆరోపణలు, క్రూరమైన ప్రకటనలు ప్రతిసారీ తప్పుగా నిరూపించబడ్డాయి. మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రచారం ప్రజలను ప్రభావితం చేయడంలో విఫలమైంది. తన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించబోరు. 2014 తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం’ అని తెలిపారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం రాహుల్ పై విమర్శలు గుప్పించారు. డ్రామా చేసి ప్రజాధనాన్ని వృధా చేసే బదులు ఆయనను ప్రజలు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాగా, ప్రధాని మోడీ, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ మాస్కులు ధరించి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ పై వ్యాఖ్యలు చేశారు..
చర్లపల్లి జైలుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి..
కస్టడీ ముగియడంతో లగచర్ల ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని సోమవారం పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు..తొలుత కొడంగల్ మున్సిఫ్ కోర్టులో న్యాయాధికారి ముందు హాజరు పరిచి, అనంతరం జైలుకు తీసుకెళ్లారు. లగచర్లలో భూసేకరణ విషయమై అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్లిన అధికార్లపై దాడులు చేశారంటూ 71 మందిపై కేసులు నమోదయ్యాయి. .దీని వెనుక కుట్ర ఉందనే కోణంలో పట్నం నరేందర్‌రెడ్డిని ప్రథమ నిందితుడు (ఏ1)గా పేర్కొని కేసు పెట్టారు. అయితే, ఆ దాడితో తనకు సంబంధం లేదని విచారణలో ఆయన సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. చివరగా కోర్టులో హాజరుపర్చగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన న్యాయాధికారికి చెప్పారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి కొడంగల్ కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు…
ఆస్తుల పంపకం విషయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం..!మోహన్ బాబు ఇంటికి లేడీ బౌన్సర్లు..!
ఆస్తుల పంపకం విషయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు లేడీ బౌన్సర్లు చేరుకున్నట్లు తెలుస్తోంది…ఇవాళ (సోమవారం) సాయంత్రం జల్పల్లి నివాసానికి మంచు విష్ణు రానున్న నేపథ్యంలో మరోసారి పెద్దఎత్తున వివాదం చెలరేగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన 8 మంది లేడీ బౌన్సర్లను పంపించినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చిన తర్వాత మరోసారి వివాదం జరిగే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆదివారం ఘర్షణ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆస్తుల పంపకం విషయంలో మోహన్ బాబు ఆగ్రహించారని, ఈ మేరకు ఆయన అనుచరులు వినయ్, బౌన్సర్లు కలిసి మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. మనోజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయని, ఆ గాయాలతోనే తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మనోజ్ వెళ్లారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇరువురూ మాట్లాడేందుకు నిరాకరించారు.
అయితే ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు వైద్యులు చికిత్స అందించారు. పలు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఎడమవైపు ఉన్న భుజానికి గాయమైనట్లు మెడికల్ రిపోర్ట్‌లో వైద్యులు తెలిపారు. మనోజ్ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. జల్పల్లి ఫామ్ హౌస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పొట్ట, వెన్న పూస, మెడకు కనిపించని గాయాలైనట్లు వెల్లడించారు. అయితే 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉండాలని మనోజ్‌కు వైద్యులు సూచించగా సోమవారం మరోసారి వస్తానని చెప్పి మనోజ్ డిశ్చార్జి అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆస్తుల పంపకం విషయంలో మనోజ్, తాను గొడవపడినట్లు వస్తున్న వార్తలను మోహన్ బాబు ఖండించారు. తాను మనోజ్‌ను కొట్టానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తమ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయెుద్దంటూ ఎక్స్ వేదికగా మోహన్ బాబు కోరారు.కాగా, మరికాసేపట్లో జల్పల్లి నివాసానికి మంచు విష్ణు చేరుకోనున్నారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విష్ణు వచ్చారు. ఈ నేపథ్యంలో జల్పల్లి నివాసానికి పెద్దఎత్తున బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణుకు పోటీగా మనోజ్ సైతం బౌన్సర్లను రప్పించారు. అలాగే ఆళ్లగడ్డ నుంచి మనోజ్‌కు మద్దతుగా మరికొందరు చేరుకున్నారు. విద్యానికేతన్, ఎంబీయూలో కీలకంగా ఉన్న వినయ్ అనే వ్యక్తి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. విష్ణు వస్తుండడంతో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది…
చరిత్ర తెలియని దద్దమ్మలు… ఉద్యమ ద్రోహులు..కాంగ్రెస్ సిఎం.. కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు..!
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం గండిమైసమ్మలో నిర్మించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.మేడ్చల్‌లో జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం గండిమైసమ్మలో నిర్మించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. రుణ మాఫీ చేసినట్లు గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఒక్కరికీ రుణమాఫీ ఎందుకు కాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ సభలో ప్రసంగిస్తున్న సమయంలో రుణ మాఫీకి సంబంధించిన పలు పత్రాలను బాధిత రైతులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందిస్తూ ఒక్క ఘట్కేసర్ మండలంలోనే రుణమాఫీ అయ్యే రైతులు 1189 మంది ఉంటే ఒక్కరికీ కూడా రుణమాఫీ కాలేదని రికార్డులు చూపిస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం రుణమాఫీ రైతులందరికీ చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ సన్నాసులకు ఇదొక్కటి సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు అమలు జరిగేలా ప్రజలకు మద్దతుగా ప్రజా పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చరిత్రను తెలుసుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణను నిండా ముంచుతారన్నారు.
ఏ ఎన్నిక వచ్చినా..
రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా.. బీఆర్ఎస్దే గెలుపు ఉండేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏ ఒక్క పథకం అమలు చేయకుండానే ప్రజాపాలన పేరిట విజయోత్సవాలను నిర్వహిస్తూ ప్రజా సంపదను దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే బూత్ స్థాయి నుంచి సభ్యత్వాలను చేస్తూ.. పూర్తిస్థాయిలో కమిటీలను వేసుకొని పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చేలా నూతన ఒరవడికి శ్రీకారం చుడుతామన్నారు..
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం..!
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది..ఆలయాలు, మత సంస్థలకు భద్రత కరవయిందని, వాటిపై దాడులు జరగడం విచారకరమని తెలిపింది. సోమవారం బంగ్లాదేశ్ పర్యటన నిమిత్తం వచ్చిన భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రి తన చర్చల్లో ఈ విషయాన్ని నిర్మొహమాటంగా తెలిపారు. ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి తొలగించిన తరువాత భారత ప్రభుత్వ ఉన్నతాధికారి పర్యటనకు రావడం ఇదే ప్రథమం. ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్, తాత్కాలిక ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేయిన్లతో చర్చలు జరిపారు.
ఇస్కాన్ గురువు చిన్మయ్ దాస్‌ను అరెస్టు చేసిన తరువాత జరిగిన హింసను ప్రస్తావించారు. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూన్సతోనూ భేటీ అయ్యారు. అయితే, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు యూనస్ మాట్లాడుతూ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలు చేసిన విప్లవం భారత్‌కు నచ్చినట్టు లేదన్నారు. మైనార్టీలను వేధిస్తున్నారంటూ భారత్ మీడియా అతిశయోక్తులను ప్రచారం చేస్తోందన్నారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఇతర దేశాలకు లేదని బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్ స్పష్టం చేశారు…..
అమ్మ రూపమే..నమూనాను మార్చితే ఊరుకోం.. అవమానిస్తే చట్టపరంగా చర్యలు.. సిఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వం ఉట్టిపడేలా బహుజనుల తెలంగాణ తల్లిగా రూపొందించామన్నారు. విగ్రహ రూపకల్పన సందర్భంలో రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, దేవతలా ఉండాలా? సొంత మాతృమూర్తిలా ఉండాలా? అన్న చర్చ జరిగిందని పేర్కొన్నారు. దేవత గుడిలో ఉంటుందని, తల్లి ఇంట్లో ఉంటుందని, మనల్ని ఒడిలో పెట్టుకుని పెంచుతుందని గుర్తు చేశారు. పైగా అందుకే తల్లి రూపమే ఉండాలన్న అభిప్రాయాల మేరకు బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనుమతితో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. ”తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన సందర్భంలో రెండు అంశాలు చర్చకు వచ్చాయి. విగ్రహం.. వజ్ర వైడూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులతో దేవతలా ఉండాలా? లేక మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మన అమ్మలా ఉండాలా? అనే ప్రస్తావన వచ్చింది. మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులందరూ తెలంగాణ తల్లి విగ్రహం మన తల్లిలా ఉండాలని అభిప్రాయపడ్డారు. దేవత గుడిలో ఉంటుంది.. తల్లి మన ఇంట్లో ఉంటుంది. తల్లి ఒడిలోనే మనం పెరుగుతాం కాబట్టి.. తెలంగాణ తల్లి కావాలని చెప్పారు. తల్లి ప్రతిరూపాన్ని పెట్టుకోవాలని సూచించారు. ఆ మేరకే ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసినట్లుగా ఉండే విగ్రహాన్ని రూపొందించాం” అని సీఎం అన్నారు..
సోనియాగాంధీ.. ఒక మాతృమూర్తిగా, రాజకీయ ఆలోచనలను పక్కనపెట్టి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ ప్రకటన ఇప్పించారు. ఆ తర్వాత అవాంతరాలు ఎదురైనా, పార్టీపరంగా ఎన్నో కోల్పోయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చారు” అని రేవంత్ వివరించారు…