మల్లయ్య గూడెం కొత్తగుంట చెరువుకు గండి..

మల్లయ్య గూడెం కొత్తగుంట చెరువుకు గండి.. ‍ వృధాగా క్రిందికి పోతున్న చెరువు నీరు ‍ ‍ ‌ ‍ ‍ ‍ ‍ పట్టించుకోని ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్న అధికారులు..
‍ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.
. ‍ ‍ ‍ ‌ ‍ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని మల్లయ్య గూడెం చెరువుకి అలుగు గండికి దగ్గర పక్కనే పెద్ద గండిపడి నీరు మొత్తం వృధాగా క్రిందికి పోవడం జరుగుతుంది ఇది గత ఆరు నెలల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్థానిక రైతులు ప్రజలు తెలిపారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన చెరువులో నీటిని క్రిందికి వృధాగా పోకుండా ఆ యొక్క గండిని పటిష్టంగా గట్టిగా మరమ్మత్తులు చేయించాలని నేడు వర్షాకాలం కారణంగా భారీ వర్షాలు వచ్చిరి వరదలు వచ్చినప్పుడు మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకో కోకుండా గెట్టి మరమ్మతులు చేయించాలని స్థానిక రైతులు ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య గూడెం రైతులు గ్రామ ప్రజలు కర్షకులు కార్మికులు కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు మెంబర్ బొలిశెట్టి శంకర్ ఐదో వార్డు మెంబర్ బొలిశెట్టి నరేష్, కుమార్, సిక్కుల రాములు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..