భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.!

సీఎం రేవంత్ రెడ్డి… రైన్ అలర్ట్

*• భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.*

_• హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించిన సీఎం._

_• పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన సీఎం._

_• చీఫ్ సెక్రటరీ, డీజీపీ, CURE స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్న సీఎం._

_• నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి._

_•రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సూచించిన సీఎం.