* జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
• రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం
చేయకండి: ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
• జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తా
• జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం అవసరమైతే రాజీనామా చేస్తా
• సామాజిక సమీకరణాలు అడ్డిస్తే రాజీనామా చేస్తా
• నేను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపిస్తా
• ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు
• పార్టీకోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం
సరికాదు: ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..
కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే (Ibrahimpatnam MLA) మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) ఈ విధంగా పార్టీ తీరుపై అసంతృప్తి గళం వినిపించారు..