మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామంలో అయ్యప్ప స్వామి పూజ ని అడ్డుకున్న పోలీసులు..!

మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామంలో అయ్యప్ప స్వామి పూజ ని అడ్డుకున్న పోలీసులు..

అయ్యప్ప స్వాములు అంతా కలిసి పడిపూజ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో.. పోలీసులు ఒక్కసారిగా పూజ వద్దకి వచ్చి పూజని ఆపేయాలంటూ డిజె తొలగించాలంటూ అయ్యప్ప మాలధారంలో ఉన్న వారితో కొంత సేపు వాగ్వాదం నెలకొంది.. దీంతో ఆగ్రహించిన అయ్యప్ప మాలదారులు ఒక్కసారిగా పూజకి అడ్డు తగులుతున్న పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు…. అయ్యప్ప స్వామికి పూజ నడుస్తున్న సమయంలో పోలీసులు షూ వేసుకొని మరీ పడిపూజ జరిగే దగ్గరికి వచ్చి హంగామా సృష్టించారని అయ్యప్ప స్వాములు ఆరోపించారు… అందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…… పోలీసులు డిజే తో సహా మొత్తాన్ని పోలీస్ స్టేషన్ కి తరలించండి అని ఒకసారి గా ఆర్డర్ వేయడంతో.. ఆగ్రహించిన స్వాములు జైశ్రీరామ్ నినాదాలు చేయడం అక్కడినుండి ఎస్సైని అడ్డుకొని పూజ నిర్వహిస్తున్న వద్దనుండి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది…

కనీసం హిందువులకి పూజ ఏర్పాటు చేసుకునే అర్హత కూడా లేదా ఏ దేశంలో ఉన్నాం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఎవరు పాలిస్తున్నారు.. అంటూ నెట్లో సెటైర్లు వేస్తున్నారు…

చర్చిల్లో పెద్దపెద్ద మైకులు పెట్టి మారు మోగిస్తుంటే కనీసం వారిని అడ్డుకోవడం చేతకాని పోలీసులు.. సాంప్రదాయ బద్ధంగా ఏదో ఒక రోజు పూజని ఏర్పాటు చేసి నలుగురికి సంధి రూపంలో బిక్ష రూపంలో పెడుతున్న తమపై ఇలా కక్షకట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు…

పూజ వద్దకి షూ తో వచ్చి అయ్యప్ప స్వాముల పట్ల అచ్చుత్సాహంగా మాట్లాడిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు…. పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. హిందువులపై కక్షగట్టి కావాలనే ఇలా రెచ్చగొడుతున్నారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…. హిందూదేశంలోనే హిందువులకే రక్షణ లేకుండా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

అయ్యప్ప మాల ధారణ లో ఉన్న స్వాములు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నాయి.. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు…. ఈ చర్యలను ఖండించిన పలు హిందు పరిరక్షణ సమితులు…