నరేంద్రమోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారు… రెండు రోజులపాటు హైదరాబాదులోనే…!!!

నరేంద్రమోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న మోడీ తొలిసారి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. జులై 2న స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్తారు. అనంతరం హెచ్ఐసీసీలో జరిగే కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. మొదటి రోజు కార్యక్రమం పూర్తైన అనంతరం తిరిగి రాజ్ భవన్ చేరుకోని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. జులై 3న హెచ్ఐసీసీలో జరిగే రెండు రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఆ రాత్రికి రాజ్ భవన్ లో బస చేస్తారు. 4న ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఏపీకి వెళ్లనున్నారు. ..ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల
సీఎంలు కూడా హైదరాబాద్ కు రానున్నారు.
వారి భద్రత కోసం అదనపు బలగాలను సిద్దంగా ఉంచాలని రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. కార్యవర్గ సమావేశాలకు వచ్చే అతిధుల కోసం సిటీలోని టాప్ హోటల్స్ లో రూమ్స్ బ్లాక్ చేశారు. ఆయా హోటల్స్ చుట్టూ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలు ఉండే హోటల్స్ లో పనిచేస్తున్న వారి ఆధార్ తో పాటు ఐడీ కార్డులను పరిశీలిస్తున్నారు. వీళ్ళకి స్పెషల్ ఐడీ కార్డులు జారీ చేస్తారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. పీఎం మోడీ టూర్ సెక్యూరిటీకి సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఎస్పీజీ బృందాలతో నిరంతరం కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు.