నా ఫోన్ ట్యాప్ చేశారు.. విని ఉంటే చెవుల్లో నుంచి రక్తాలు కారేవి: MP.

నా ఫోన్ ట్యాప్ చేశారు.. విని ఉంటే చెవుల్లో నుంచి రక్తాలు కారేవి: MP
తెలంగాణ : ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని BJP MP ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ జరిపిస్తున్న సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని చెప్పారు. ‘నా ఫోన్ ట్యాప్ అవుతోందని Apple నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయి. తర్వాత జాగ్రత్తలు తీసుకున్నాం. కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి నేను ఓపెన్‌గానే కాల్స్ మాట్లాడా. ఒకవేళ వాళ్లు ఆ మాటలు విని ఉంటే చెవుల్లో నుంచి రక్తాలు కారి ఉంటాయి’ అని పేర్కొన్నారు.