నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం..!

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లోని కౌండిన్య ఫంక్షన్ హాల్ నందు మంగళవారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడునని మఠంపల్లి మండల తహసీల్దార్ మంగ వెల్లడించారు.. తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో ప్రస్తుతం 740 కొత్త కార్డులు మరియు 1600 ఎడిషన్ కార్డులు ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్ర సివిల్ సప్లై శాఖా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేతుల మీదుగా మఠంపల్లి మండల పరిధిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేస్తారని ఆమె తెలియజేశారు.కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరు రేషన్ కార్డును తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ మంగ కోరారు…

సేకరణ..
నయీం జర్నలిస్టు..
హుజూర్ నగర్.