🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 22 – 02 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
బహుళ పక్షం,
తిథి : *నవమి* ఉ9.38 వరకు,
నక్షత్రం : *జ్యేష్ఠ* మ2.30 వరకు,
యోగం : *హర్షణం* ఉ9.15 వరకు,
కరణం : *గరజి* ఉ9.38 వరకు,
తదుపరి *వణిజ* రా10.03 వరకు,
వర్జ్యం : *రా10.56 – 12.37,*
దుర్ముహూర్తము : *ఉ6.28 – 8.00,*
అమృతకాలం : *ఉ6.47వరకు,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.28,
సూర్యాస్తమయం: 6.00,
*_నేటి మాట_*
*మధుర భక్తి*
ఈరోజుల్లో అందరం భక్తులమే, కానీ భగవంతుడిని మాత్రం అందుకోవడం లేదు, చేరడం లేదు, ఎందువల్ల???
శ్రీ కృష్ణుని మీద గోపిక లకు ఉండేది మధురమైన భక్తి అన్నారు.
ఆయన భగవంతుడు అని తెలుసో తెలియదో అలాఉంచి, ఆయన ప్రేమ వారిని కట్టి పడ వేసింది…
మధరమైనటువంటి మోహంతో కూడిన భక్తి అది – అంటే ఫలాపేక్ష లేదు.
… వారికి అతడు కావాలంతే!…
శ్రీ కృష్ణుని గోపికలు ఎప్పుడైనా ఏదైనా అడిగారా?
ఏగోపికయినా అడిగినట్లు భాగవతంలో ఎక్కడయినా ఉందా?
సహాయం చేయమని అడిగారా?
రాళ్ళ వాన పడుతుంటే ఆయన కదా వాళ్ళ ని రక్షించాడు.
ప్రాణాలు పోతుంటే, ” కృష్ణా ఏంచేయమంటావు? ఇంద్ర పూజ మానేస్తే ఇలా ఉంది విపరీతం” అంటే, ” మిమ్మల్ని నేను రక్షిస్తాను” అని ఆయన బాధ్యత తీసుకున్నాడు.
కానీ వాళ్ళు ఆయనను అడిగిందేలేదు, కృష్ణుడు ఏమి చేసినా వాళ్ళకు ప్రేమే…! అంతే !!…
గోపికలు ఎవరైనా ధనం అడిగారా? మా ఆవులు కనపడటంలేదు, కాస్త వెతికి పెట్టమన్నారా? అలా ఏమీ అడగలేదు ఎప్పుడూ!.
కానీ భక్తికి, నీవు వేరు నేను వేరు అనే భావన ఉంటుంది కనుక, అది వియోగ దుఃఖాన్నిస్తుంది.
అందువల్ల “జ్ఞానం వలన నన్ను చేరుకోండి”అన్నాడు కృష్ణ పరమాత్మ.
మనము నిరంతరము భగవంతునితో తిరుగుతున్నా కూడా భగవంతుని వియోగం వల్ల దుఃఖ పడుతున్నాము…
ఆయనను అంతర్యామిగా ధ్యానం చేస్తే ఆనందం అనుభవిస్తారు సుమా! అని ఆయన బోధ చేసారు…
నేను మీతో దగ్గరగా ఉన్నాను, అని ఈశ్వర తత్వాన్ని గోపిక లకు చెప్పాడు కృష్ణ పరమాత్మ.
ఇవి మనందరికీ కూడా శిరోధార్యములైనటువంటి మాటలు.
చరిత్ర లో అనేక మంది భక్తులు దారిద్ర్యాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ధనం అడగలేదు, ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, తుదకు పొందారు.
కానీ ఈరోజు మనం ధన కనక వస్తువాహనాల కోసం పరితపిస్తూ, ఎన్నో సువర్ణావకాశములను వదలి, సంసారమనే మాయలో పడి, నా బిడ్డలు, నావారు, నేను అనే బంధం లో చిక్క్కుకుంటున్నాము…
ఇది కాదు భక్తి !!…
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏