నేటి పంచాంగం…నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 19 – 05 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,

తిథి : *సప్తమి* రా1.28 వరకు,
నక్షత్రం : *శ్రవణం* మ3.52 వరకు,
యోగం : *బ్రహ్మం* రా1.18 వరకు,
కరణం : *భద్ర* మ1.52 వరకు,
తదుపరి *బవ* రా1.28 వరకు,

వర్జ్యం : *రా7.49 – 9.24,*
దుర్ముహూర్తము : *మ12.21 – 1.13,*
మరల *మ2.55 – 3.47,*
అమృతకాలం : *ఉ7.01 వరకు,*
మరల *తె5.18 నుండి,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 5.31,
సూర్యాస్తమయం: 6.21,

*_నేటి మాట_*

*ఏదైనా సాధించాలి అంటే???*
_వేడి చూపనిదే వెన్న ఎలా కరుగుతుంది!!_
” భగవద్గీతలో కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్య జ్య మమేకం శరణం వ్రజ”
“అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః”

ఇప్పుడు మనము ఏమి చేస్తున్నాము?
” సర్వధర్మాన్ పరిత్యజ్య ” అన్న ఆఒక్కమాటను తీసుకుంటున్నాము, ఎట్లా వదిలి పెట్టాలి?
శరణాగతుడవై వదిలి పెట్ట మన్నాడేగానీ, అన్నీ వదిలిపెట్టి నీ యిష్టమొచ్చినట్లు పొమ్మని చెప్పలేదు.

“కానీ, పరమాత్ముడు చెప్పిన వాక్యాలలో మనకు ఇష్టమైన దానినే తీసుకుంటున్నాము”.
” ఇష్టం లేని దానిని వదిలి పెడుతున్నాము. “…..

“యోగక్షేమం వహామ్యహం”. పరమాత్ముడు నీ యేగక్షేమాన్ని చూసుకుంటానన్నాడు.
నిజమే! కానీ దానికి ముందు నీవు చేయవలసిన పనులు ఎన్ని ఉన్నాయి?!…
నిరంతరము పరమేశ్వరుని చింతిస్తూ, ఆయనకు అర్పితమై ఉన్నప్పుడే ” యోగక్షేమం వహామ్యహం”. అంతేకాని, భగవంతుని స్మరించకుండా, ధ్యానించకుండా, ”
భగవంతుడు నా యేగక్షేమాన్ని చూడటం లేదంటే ఎలా చూస్తాడు చెప్పండి.

ఏషాపుకెళ్లినా డబ్బులిచ్చినపుడే కదా వస్తువు ఇచ్చేది.
మరి పరమాత్ముని కి నిర్మలమైన మనస్సు నివ్వకుండా, అనుగ్రహాన్ని అందుకోవాలంటే, అది జరిగే పనేనా? ఏనాటికీ కాదు.
పరమాత్ముని హృదయాన్ని కరిగించే ప్రవర్తన మనలో ఉన్నప్పుడే పరమాత్ముడు కరుగుతాడు కానీ, మనము వేడి చూపకుండా ఎంత మెత్తని వెన్నును కరగమంటే కరుగుతుందా?!మనలో భగవంతుని పై
విశ్వాసము సన్నగిలిలుతోంది. ఏమి ఖర్మమో! ఏమిటో!
పరమాత్ముని పై సంపూర్ణ విశ్వాసము తో ఉన్నప్పుడే మనము సాధించలేని కార్యము ఈ లోకములో లేదు.

*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏