🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 04 – 11 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం – శరదృతువు,
కార్తీక మాసం – శుక్ల పక్షం,
తిథి : తదియ రా8.54 వరకు,
నక్షత్రం : అనూరాధ ఉ7.04 వరకు,
యోగం : శోభన ఉ11.38 వరకు,
కరణం : తైతుల ఉ8.26 వరకు,
తదుపరి గరజి రా8.54 వరకు,
వర్జ్యం : మ12.58 – 2.39,
దుర్ముహూర్తము : మ12.07 – 12.53,
మరల మ2.24 – 3.09,
అమృతకాలం : రా11.04 – 12.46,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండం : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.02,
సూర్యాస్తమయం: 5.26,
*_నేటి మాట_*
🔔 *కార్తీకం* 🔔
_కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందాము..!!_
🌺దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.
🌿న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||
🌺అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.
*ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాము!!🌺*
🌿కార్తీక శుద్ధ పాడ్యమి :
తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి, కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
🌺విదియ :
సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
🌿తదియ :
అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
🌺చవితి :
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
🌿పంచమి :
దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
🌺షష్ఠి :
ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.
🌿సప్తమి :
ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
🌺అష్టమి :
ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
🌿నవమి :
నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
🌺దశమి :
నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
🌿ఏకాదశి :
దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
🌺ద్వాదశి :
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
🌿త్రయోదశి :
సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
🌺చతుర్దశి :
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.
🌿కార్తీక పూర్ణిమ :
కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.
🌺కార్తీక బహుళ పాడ్యమి :
ఆకుకూర దానం చేస్తే మంచిది.
🌿విదియ :
వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
🌺తదియ :
పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
🌿చవితి :
రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
🌺పంచమి :
చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
🌿షష్ఠి :
గ్రామదేవతలకు పూజ చేయాలి.
🌺సప్తమి :
జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
🌿అష్టమి :
కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
🌺నవమి :
వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
🌿దశమి :
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
🌺ఏకాదశి :
విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
🌿ద్వాదశి :
అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
🌺త్రయోదశి :
ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
🌿చతుర్దశి :
ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
🌺అమావాస్య :
పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..
ఉపవసాది కార్యక్రమాలు కేవలం మీ ఆరోగ్యం సహకరిస్తేనే చేయవలెను…
*_☘️శుభమస్తు☘️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏