నేటి పంచాంగం…రాశి ఫలాలు…..

తేది : 1, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 22 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 48 ని॥ వరకు)
యోగము : ఐంద్రము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 7 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 11 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 4 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 8 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 58 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : సింహము

మేషం?
మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి బయటపడతారు. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. రాజకీయ నాయకులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జారవిడుచుకుంటారు.
అదృష్ట సంఖ్య 7

వృషభం?
వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు శుభదాయకం. ఏజెంట్లకు, బ్రోకర్లకు కలిసివచ్చే కాలం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీల వ్యక్తిగత భావాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధ బాంధవ్యాలు నెలకొంటాయి.
అదృష్ట సంఖ్య 7

మిథునం?
ప్రైవేటు సంస్థల్లో వారు, రిప్రజెంటిన్లు, మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. మిత్రులను కలుసుకుంటారు. కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఆకస్మిక దూరప్రయాణాలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
అదృష్ట సంఖ్య 5

కర్కాటకం?
ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. వ్యాపార రంగాల్లో పోటీ పెరగడం వల్ల అందోళనకు గురవుతారు. ఉద్యోగస్తులు చంచల స్వభావం విడనాడి కృషిచేసిన సఫలీకృతులవుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
అదృష్ట సంఖ్య 8

సింహం?
విదేశీ ప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులుపునఃప్రారంభం కాగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కార్మికుల నేర్పుకు పరీక్షా సమయం అని చెప్పవచ్చు. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి.
అదృష్ట సంఖ్య 7

కన్య?
ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పడు. కాంట్రాక్టర్లకు పనివారలతో ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. విద్యార్థులు అనవసర ప్రసంగాలు చేయటంవల్ల మాటపడక తప్పదు. ఏజెంట్లు, బ్రోకర్లు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
అదృష్ట సంఖ్య 5

తుల ⚖️
కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. పూర్వపు పరిచయవ్యక్తుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది.
అదృష్ట సంఖ్య 7

వృశ్చికము?
ఆర్ధికలావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రేమికుల అనుమానాలు తొలగిపోతాయి. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నూతన దంపతులకు సంతానప్రాప్తి. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
అదృష్ట సంఖ్య 9

ధనస్సు?
ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తగలవు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులుపడటం వల్ల మాటపడతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్ఠలకు సవాలుగా నిలుస్తాయి.
అదృష్ట సంఖ్య 6

మకరం?
బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. జీవితంలో ఆటుపోట్లు తప్పవని గుర్తించండి.
అదృష్ట సంఖ్య 6

కుంభం⚱️
నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
అదృష్ట సంఖ్య 5

మీనం?
సన్నిహితులతో కలిసి పలు కార్యమ్రాలలో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు దూరప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
అదృష్ట సంఖ్య 2