పాకిస్తాన్ -ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అకస్మాత్తుగా యుద్ధ వాతావరణం..!

పాకిస్థాన్ తన పొరుగుదేశం ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఆకస్మిక దాడులకు తెగబడింది.

పాకిస్తాన్ -ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగిన కాల్పులు, ఆ వెంటనే జరిగిన వైమానిక దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది..అక్టోబర్ 27న దక్షిణ వజీరిస్థాన్‌లోని అంగూర్ అడ్డా ప్రాంతంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం..దీనికి ప్రతికారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగిన పాకిస్థాన్ సైన్యం.. భారీ ఆయుధాలతో సరిహద్దు ఆవల ఉన్న తాలిబాన్ల కీలక శిబిరాలు, బంకర్లను నేలమట్టం చేసింది.

ఈ ఆకస్మిక దాడిలో తాలిబాన్ల స్థావరాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు కొంతమంది ఫైటర్లు పారిపోయారని, పలువురు ప్రాణాలు కోల్పోయారని సమాచారం వెలువడింది. అయితే, ఈ దాడిలో సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న అమాయక పౌరులు కూడా ప్రభావితమయ్యారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.