*రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. ఎప్పుడంటే?*
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. PM కిసాన్ 24వ విడత నిధులను అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో అర్హులైన రైతుల ఖాతాల్లో ₹2 వేల చొప్పున జమ కానున్నాయి. ఈ స్కీమ్ కింద కేంద్రం ₹2 వేల చొప్పున ఏడాదికి 3 విడతల్లో ₹6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 24వ విడత ద్వారా 9.44 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి కలగనుంది. E-KYC చేసుకున్న రైతులకే డబ్బులు అందుతాయని కేంద్రం స్పష్టం చేసింది…
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సాయం పొందుతున్న రైతులు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విడతను అక్టోబర్ 30, 2026న విడుదల చేయనున్నట్లు అక్టోబర్ 23న వచ్చిన తాజా నివేదికలు పేర్కొన్నాయి. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ కానున్నాయి. పండుగకు ముందు అందే ఈ మొత్తం రైతులకు కొంత ఆర్థిక తోడ్పాటు ఇవ్వనుంది. అయితే చెల్లింపు స్థితిని అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్లో తనిఖీ చేయడం మంచిది..