ఈరోజు ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలి…ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి..

అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆరోపణ..

నల్గొండ జిల్లా..

*🔹మిర్యాలగూడలో ప్రణయ్ కేస్ తీర్పు అనంతరం కుమారుని సమాధి వద్ద నివాళులర్పించిన తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, తమ్ముడు అజయ్..*

_• కుమారుని సమాధి వద్ద పూలు చల్లి తీవ్ర బాగోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు.._

_•🔹తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ కుటుంబ సభ్యులు నాలుగు గంటలకు మీడియా ముందుకు రానన్నట్లు వెల్లడి.

*కోర్టు తీర్పు అమృత భావోద్వేగం*

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అఙ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.

కాగా కోర్టు తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు.

ప్రణయ్ తల్లి.., భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు..

నల్గొండ జిల్లా..

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి మాట్లాడుతూ ..

నల్గొండలో ఈరోజు ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలి..

జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశాం..

ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి వారందరికీ.. వారందరికీ తీర్పు కనువిప్పు కలగాలి..

మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం..

అమృతకు భర్త లేడు.. నాకు కొడుకు లేడు.. నా మనవడికి నానా లేడు..

సుభాష్ శర్మకు ఉరిశిక్ష మిగతా ఆరుగురికి యావకి జీవ కారాగార శిక్ష పడింది..

వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయి..

ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారకరం..

ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి..

ఈ తీర్పుతో ఇలా జరిగే హత్యలు ఆగిపోవాలి..

మొదటి నుంచి కేసుకు పూర్తిస్థాయిలో సహకరించిన డీఎస్పీ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు..

ఐదున్నర సంవత్సరాలు కోర్టు తీర్పుకై వేచి చూశాం..

ఈ తీర్పుతో తృప్తి చెందామ్..

వందమంది సాక్షులతో.. 1600 పేజీల చార్జిషీట్ తో ఎస్పి రంగనాథ్ ఆధ్వర్యంలో చాలా బాగా కేసును సోదించారు..

ఈ కేసులో న్యాయవాదిగా వ్యవహరించిన దర్శనం నరసింహ ఎలాంటి ప్రలాభాలకు లోను కాకుండా న్యాయం పోరాటం చేశాడు న్యాయం కోసం..

ఈ తీర్పు మీకు సంతో మీకు సంతోషాన్ని ఇచ్చిందని చాలామంది అడుగుతున్నారు..

నాది సంతోషము కాదు నా బాధ.. నా బాధను ఎవరు తీర్చలేరు..

చంపుకోవడం కరెక్ట్ కాదు నాకు ఎవరి మీద.. నాకు ఎవరి మీద కోపం లేదు..

హత్యలు ఆగాలని సాక్షాలు చెప్పాం..

న్యాయస్థానాలు న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం న్యాయం అనేది ఉందని రుజువైంది.

నల్లగొండ జిల్లా..

*🔹నల్గొండ కోర్టు వద్ద ఉద్రిక్తత..*

_• అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆందోళన.._

ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కు జీవిత ఖైదు..

ప్రణయ్ హత్య కేసులో A6 గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్..

అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆరోపణ..

శ్రవణ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం..

శ్రవణ్ కు జీవిత ఖైదు పడడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులు..

*ప్రణయ్ హత్య కేసు నిందితులు*

A1 మారుతీరావు (అమృత తండ్రి),
*A2 సుభాష్ శర్మ(బిహార్), ఉరిశిక్ష + 15,000/- fine*
A3 అస్గర్ అలీ, *జీవిత ఖైదీ.+ 10,000/- fine*
A4 అబ్దుల్ భారీ, *జీవిత ఖైదీ + 15,000/- fine*
A5 అబ్దుల్ కరీం, *జీవిత ఖైదీ + 15,000/- fine.*
A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), *జీవిత ఖైదీ + 15,000/- .*
A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్),*జీవిత ఖైదీ+10,000/-fine .*
A8 నిజాం (ఆటో డ్రైవర్). కరీం *జీవిత ఖైదీ+ 10,000/- fine.*

*సాయంతో అస్గర్కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ ను హత్య చేయించాడు*