ప్రణయ్ హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు…

*రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు*.

*ఏ-2 గా ఉన్న సుభాష్ శర్మ కు ఉరిశిక్ష*

*నిండుతులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం*

*శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్న నేరస్థులు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఏ1గా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. అయితే కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ను హత్య చేయించారు.