బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.

ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం
మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..

3-4 రోజుల్లో అల్పపీడనం బలపడే అవకాశం
ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనం
బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం..

ఇది తదుపరి 3 నుంచి 4 రోజుల్లో బలపడి, పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు-దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఇది బుధవారానికి వాయుగుండంగా మారవచ్చని కొన్ని వాతావరణ మోడల్స్ వెల్లడించాయని.. అల్పపీడనంగానే కొనసాగుతుందని మరికొన్ని మోడల్స్ అంచనా వేశాయని చెప్పారు. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.