న్యాచురల్ టోనర్, ఫేస్ మిస్ట్…ముఖంపై నిగారింపును పెంచడానికి, అలసిపోయిన చర్మానికి ప్రాణం పొయ్యండి ఇలా..!

ప్రతి ఒక్కరూ మృదువైన, మెరిసే , ప్రకాశవంతమైన చర్మాన్ని ఇష్టపడతారు. తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ ముఖ్యం. ఎందుకంటే ఇది మన చర్మాన్ని ఎల్లప్పుడూ మృదువుగా ఉంచుతుంది. అంతే కాకుండా ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది..

సహజసిద్ధమైన సౌందర్య సాధనాలలో రోజ్ వాటర్ ఎప్పుడూ ముందుంటుంది. ఇది కేవలం చర్మాన్ని కాపాడటమే కాకుండా అనేక రకాలుగా శరీరానికి మేలు చేస్తుంది. ఎలాంటి రసాయనాలు లేని ఈ సహజ పదార్ధాన్ని చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖంపై నిగారింపును పెంచడానికి, అలసిపోయిన చర్మానికి ప్రాణం పోయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో సులభంగా దొరికే ఈ గులాబీ నీటితో ఎన్నో ఆరోగ్య, సౌందర్య లాభాలు పొందవచ్చు..

న్యాచురల్ టోనర్, ఫేస్ మిస్ట్..

చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ ని సహజ టోనర్‌గా ఉపయోగించవచ్చు. దూది సహాయంతో ముఖానికి రాస్తే చర్మం సమతుల్యంగా మారి కాంతివంతంగా మారుతుంది. దీనికి కొన్ని విటమిన్ ఇ చుక్కలు కలిపితే మరింత మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎండలో తిరిగి వచ్చినప్పుడు ముఖం డల్‌గా మారితే, స్ప్రే బాటిల్‌లో రోజ్ వాటర్ నింపుకుని ముఖంపై జల్లుకోవచ్చు. ఇది తక్షణ తాజాదననాన్ని ఇవ్వడంతో పాటు అలసటను దూరం..

ఫేస్ ప్యాక్‌లు, కంటికి ఉపశమనం

చందనం, పసుపు, కలబంద జెల్ వంటి వాటితో గులాబీ నీటిని కలిపి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే రోజంతా కంప్యూటర్ల ముందు పనిచేసి అలసిపోయిన కళ్ళకు ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. దూదిని గులాబీ నీటిలో తడిపి కళ్లపై ఉంచితే కంటి చుట్టూ ఉండే ఉబ్బరం తగ్గి ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది.

వంటకాల్లో గులాబీ నీటి వాడకం..

కేవలం అందానికే కాకుండా వంటల్లో రుచిని, సువాసనను పెంచడానికి కూడా గులాబీ నీటిని వాడతారు. అయితే దీని కోసం ప్రత్యేకంగా లభించే ఫుడ్ గ్రేడ్ రోజ్ వాటర్‌ను మాత్రమే ఉపయోగించాలి. లస్సీ, కస్టర్డ్, సేమియా, ఖీర్, కలకంద వంటి మిఠాయిల్లో దీన్ని కలపడం ద్వారా అద్భుతమైన సువాసన వస్తుంది. వంటకాలకు సరికొత్త ఫ్లేవర్ అందించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. చేస్తుంది..

చర్మానికి టోనర్ :
టోనర్ అనేది మన చర్మాన్ని మేకప్‌కు సిద్ధం చేసి, దానిని జాగ్రత్తగా చూసుకునే ఒక ఉత్పత్తి. కాలుష్యం, దుమ్ము కారణంగా, చర్మ రంధ్రాలు ధూళితో నిండిపోతాయి. ఈ రంధ్రాలను టోనర్ సహాయంతో శుభ్రం చేయవచ్చు. ఇది చర్మం యొక్క pH స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.

బియ్యం నీటితో టోనర్:

బియ్యం నీటితో తయారుచేసిన టోనర్ చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నిజానికి, బియ్యం నీటిలో ఖనిజాలు, విటమిన్ బి , ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి చాలా మేలు చేస్తాయి.