ఘోర రోడ్డు ప్రమాదం.. ఐ10 కారును ఢీకొట్టిన ఫార్చ్యూనర్ మేడిపల్లి పీర్జాదిగూడ వద్ద మద్యం మత్తులో, లైసెన్స్ లేకుండా నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఫార్చ్యూనర్ ఐ10 కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్టీలు కొట్టిన కారులోని దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అతివేగం.. మద్యం మత్తు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వెరసి హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి దారితీశాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో, ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నంబర్ 57 సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టయోటా ఫార్చ్యూనర్ కారు ముందుగా వెళ్తున్న ఐ10 కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది…
దీంతో ఐ10 కారు పల్టీలు కొట్టగా.. అదుపుతప్పిన ఫార్చ్యూనర్ రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి ఫార్చ్యూనర్ కారుపై పడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వెనుక నుంచి ఢీకొట్టడంతో పల్టీలు
మేడిపల్లి సీఐ డి.జలంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాయిశివ (30), ఆయన భార్య మేఘన (28) ఐ10 కారులో ఎల్బీనగర్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పీర్జాదిగూడలోని పిల్లర్ నంబర్ 57 సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఫార్చ్యూనర్ కారు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఐ10 కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ డివైడర్ వైపు వెళ్లింది.
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నంబర్ 57 సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫార్చ్యూనర్ కారు వెనుక నుంచి అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో, ముందున్న వాహనం అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు డివైడర్ వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో ఫార్చ్యూనర్ వాహనం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు స్తంభం విరిగి ఫార్చ్యూనర్ ముందు భాగంపై పడటంతో వాహనం నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.