సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకుపోయిన కారు..!

సూర్యాపేట జిల్లా
నెరేడుచర్ల మండలం కల్లూరులో ప్రమాదం తప్పింది. అదుపు తప్పి సాగర్‌ ఎడమ కాలువలో కారు బోల్తా పడింది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది..ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఆ సమయంలో కారులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్‌ కూడా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఆపై కారును రెస్క్కూ టీమ్‌ సహాయంతో బయటకు తీశారు..