ఓటర్ల జాబితా సవరణకు అవసరమైన సూచనలు..

బూత్ నంబర్ 97 పరిధిలో, వార్డు నంబర్ 5కు చెందిన BLO రాము నోటీసులు అందుకున్న ఓటర్లతో అంశాలపై చర్చించడం..

బూత్ నంబర్ 97 పరిధిలో, వార్డు నంబర్ 5కు చెందిన BLO రాము మరియు RP గాయత్రీ తో కలిసి నోటీసులు అందుకున్న ఓటర్లతో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది.

సెప్టెంబర్ 16న నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన 13 గుర్తింపు పత్రాల్లో ఏవైనా 3 గుర్తింపు పత్రాలను తీసుకొని హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకున్న ఓటర్లకు వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ శ్రీకన్యా సేవ్యా నాయక్ పాల్గొని, ఓటర్లకు అవసరమైన సూచనలు మరియు అవగాహన కల్పించారు.