థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ అత్యంత అవసరం. దీని లోపం వల్ల గాయిటర్, హైపోథైరాయిడ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే థైరాయిడ్ సమస్యలను నివారించడంలో అయోడైజ్డ్ ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. రాతి ఉప్పు, నల్ల ఉప్పు, పింక్ సాల్ట్ వంటి వాటిలో సహజ ఖనిజాలు ఉన్నప్పటికీ, సాధారణంగా అయోడిన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సముద్రపు ఉప్పులో సహజ అయోడిన్ ఉన్నా శుద్ధి ప్రక్రియలో తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రెండ్ల వెంట పడకుండా అయోడైజ్డ్ ఉప్పును మితంగా వాడటం, అధిక వేడికి అయోడిన్ ఆవిరైపోకుండా ఉప్పును సరిగ్గా నిల్వ చేయడం, వండటం ముఖ్యం. బీపీ, థైరాయిడ్ ఉన్నవారు వైద్యుల సలహాతో ఉప్పు మోతాదును నియంత్రించుకోవాలి…
Thyroid-Cholesterol
. థైరాయిడ్ గ్రంథి అవసరానికి తగ్గట్టు పని చేయకపోయినా, లేదా అవసరానికి మించి పని చేసినా ఆ ప్రభావం శరీరం మీద పడుతుంది. కాబట్టి గ్రంథి పనితీరును పరీక్షలతో కనిపెట్టి, మందులతో హార్మోన్ స్రావాన్ని సమంగా ఉంచుకుంటే ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ, ప్రధానంగా గర్భధారణ సమస్యలను అధిగమించవచ్చు. మునుపటితో పోల్చుకుంటే ప్రస్తుతం థైరాయిడ్ సమస్యలు పెరిగాయనే చెప్పవచ్చు. ఇందుకు జీవన, ఆహార శైలులతో పాటు ఒత్తిడి కూడా కారణమే! కుటుంబ చరిత్రలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా పిల్లలకు సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి…థైరాయిడ్ గ్రంథి సామర్థ్యం తగ్గిపోయి, హార్మోన్ స్రావం కుంటుపడే హైపోథైరాయిడ్ సమస్య ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. అధిక శరీర బరువే ఇందుకు ప్రధాన కారణం. అస్తవ్యస్థ ఆహారపుటలవాట్ల ఫలితంగా శరీర బరువు అదుపు తప్పినప్పుడు, థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా క్రమం తప్పుతుంది. కాబట్టి గర్భం దాల్చాలనుకున్నప్పుడు, గర్భం దాల్చిన తర్వాత, రక్తంలో హిమోగ్లోబిన్‌ను పరీక్షించినట్టే, థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా పరీక్షించవలసిన అవసరం ఉంటుంది. గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు తప్పనిసరిగా ఽథైరాయిడ్ పరీక్ష చేయించుకుని, సమస్యకు తగిన మందులు వాడుకోవాలి. హార్మోన్ స్రావం తగ్గిన వాళ్లు మాత్రల రూపంలో థైరాయిడ్ హార్మోన్‌ను తీసుకోవాలి.
అడ్డుకట్ట ఇలా…
థైరాయిడ్ గ్రంథి సక్రమ పనితీరు మనం తీసుకునే అయొడిన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అయొడిన్ పుష్కలంగా దొరికే చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, అయొడిన్ కలిపిన ఉప్పు, నూనె తీసుకోవాలి.