SBI నుంచి తీసుకున్న రూ.12వేల 668 కోట్ల అప్పులను ఎగ్గొట్టిన వీడియోకాన్ గ్రూప్ (Videocon Group) అధినేత వేణుగోపాల్ ..
ఇండియన్ కార్పొరేట్ వ్యాపార రంగంలో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ వీడియోకాన్ ఇండస్ట్రీస్ మాజీ ప్రమోటర్, డైరెక్టర్ వేణుగోపాల్ నంద్ లాల్ ధూత్ వ్యక్తిగతంగా దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) సంచలన తీర్పు వెలువరించింది. SBI నుంచి తీసుకున్న రూ.12వేల 668 కోట్ల అప్పులను చెల్లించడంలో విఫలం కావడంతో ముంబై బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది…2010-2012 నాటిది. వీడియోకాన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ సంస్థలకు ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు ఇచ్చిన రుణాలకు వేణుగోపాల్ ధూత్ పర్సనల్ గ్యారెంటీ ఇచ్చారు. అయితే ఆయన కంపెనీలు లోన్ రీపేమెంట్స్ చెల్లించకపోవడంతో 2018 జూన్లో అవి కార్పొరేట్ దివాలా ప్రక్రియలోకి వెళ్లాయి. అప్పట్నుంచీ బ్యాంకులు ఆయనపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో.. ఎస్బీఐ లీగల్ పోరాటాన్ని తీవ్రం చేసింది.