యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం..!

నల్గొండ జిల్లా:

*యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం..*

*ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..*

టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్నిప్రమాదం…

పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా…

ప్లాంట్ ఆవరణలో దట్టంగా అలుముకున్న పొగ…

కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం.. ప్రధాన యంత్రాలకు తప్పిన ముప్పు…

దామరచర్ల‌లో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ స్టేషన్ (YATP) లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో గల టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఆదివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు భయాందోళనలకు గురయ్యారు. పంప్ వద్ద ఉన్న లూబ్రికేషన్ ఆయిల్ లీకేజీ కావడం వల్లే ఈ మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో ప్లాంట్ ఆవరణ అంతటా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది…