పాలపిట్టను బంధించి తెచ్చిన ఘటనపై కేసు నమోదు…!

దసరా వేడుకల్లో భాగంగా 2026 అక్టోబర్ 20 (మంగళవారం) రాత్రి ఉప్పల్‌ మినీ స్టేడియంలో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు..
ఈ ఘటనలో ఉప్పల్‌కు చెందిన ఈగ చంద్రశేఖర్‌, పి. పరమేశ్వర్‌రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్ తెలిపారు..దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972లోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్‌ఎస్‌ఎస్(BNSS)‌ సెక్షన్‌ 35 కింద అక్టోబర్‌ 21న POR నం. 16-03/2025-26తో కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, నిందితులను సంబంధిత మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరుస్తామన్నారు.